: కన్నడ టీవీ హీరోయిన్ రేఖా సింధు...మరో ముగ్గురు నటులు మృతి


కన్నడ, తమిళ టీవీ నటి రేఖా సింధు మృతి చెందింది. కన్నడ, తమిళ టీవీ సీరియళ్లలో హీరోయిన్ గా నటించిన రేఖా సింధు...టీవీ నటులు అభిషేక్ కుమరన్ (22), జయకందరన్ (23), రాకేశన్ (20)లతో కలిసి బెంగళూరు నుంచి తిరుపతి వెళుతుండగా కారు యాక్సిడెంట్ కు గురైంది. అదుపు తప్పి డివైడర్ ను కారు డీ కొట్టడంతో ముందునున్న లారీ కిందికి దూసుకుపోయింది. బెంగళూరు-చెన్నయ్ జాతీయ రహదారిపై తమిళనాడులోని పెర్నంబట్ జిల్లా సున్నం పూకుట్టై గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జైంది. ఈ ఘటనలో రేఖా సింధుపాటు కారులో ఉన్న ముగ్గురూ మృతి చెందారు. 

  • Loading...

More Telugu News