: శివగామి పాత్రను శ్రీదేవి ఒప్పుకోకపోవడానికి కారణాలు ఇవేనట!
మన దేశ సినీ చరిత్రలోనే అతి పెద్ద హిట్ కొట్టిన సినిమా 'బాహుబలి-2'. ఇప్పటి వరకు ఏ సినిమాకు సాధ్యం కాని రీతిలో రూ. 1000 కోట్లను వసూలు చేసే దిశగా ఈ సినిమా దూసుకుపోతోంది. ఈ సినిమాలోని ప్రతి పాత్ర కూడా దేనికదే ప్రత్యేకం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ సినిమాకు శివగామి పాత్ర ఆయువుపట్టు లాంటిది. రమ్యకృష్ణ పోషించిన ఈ పాత్రకు తొలుత అతిలోకసుందరి శ్రీదేవిని తీసుకోవాలనుకున్నారు. దర్శకనిర్మాతలు ఆమెతో చర్చలు జరిపారు కూడా. కానీ, ఈ పాత్రను పోషించడానికి శ్రీదేవి ఒప్పుకోలేదు.
శ్రీదేవి ఈ పాత్రను చేయనని చెప్పడానికి రెండు కారణాలు ఉన్నాయట. ఒకటి ప్రభాస్ అంతటి పెద్ద కొడుక్కి తల్లిగా నటించడం. రెండోది, నిర్మాతల కళ్లు తిరిగేంత రెమ్యునరేషన్ అడగటం. కారణం ఏదేమైనప్పటికీ ఓ గొప్ప సినిమాలో నటించే అవకాశాన్ని మాత్రం శ్రీదేవి పోగొట్టుకుంది.