: రాందేవ్ బాబా నెక్స్ట్ టార్గెట్ మెక్ డొనాల్డ్స్, కేఎఫ్ సీ?
పతంజలి ఉత్పత్తులతో యోగా గురు బాబా రాందేవ్ ఇప్పటికే సంచనాలు సృష్టించారు. ఆయన దెబ్బకు రీటైలింగ్ మార్కెట్ లో పలు సంస్థలకు పెద్ద దెబ్బే తగిలింది. ఇప్పుడు ఆయన దృష్టి ప్రముఖ ఫుడ్ చైన్ సంస్థలు మెక్ డొనాల్డ్స్, కేఎఫ్ సీ, సబ్ వేలపై పడింది. త్వరలోనే చైన్ రెస్టారెంట్ల వ్యాపారంలోకి అడుగుపెట్టి, అసలు సిసలైన భారతీయ వంటకాలను అందించే దిశగా బాబా అడుగు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో రెస్టారెంట్లను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే పతంజలి గ్రూపు క్షేత్ర స్థాయిలో పని మొదలెట్టింది. ఈ రెస్టారెంట్లలో మూలికలు, శరీరానికి మేలు చేసే పదార్థాలతో రుచికరమైన ఆహారపదార్థాలను తయారు చేసి వినియోగదారులకు అందించాలని పతంజలి గ్రూపు భావిస్తోంది.