: రెండు రోజుల పాటు లోకేష్ బిజీ బిజీ!
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తొలిసారిగా నేటి నుంచి రెండు రోజుల పాటు విశాఖలో బిజీగా పర్యటించనున్నారు. నేడు సర్క్యూట్ హౌస్ కు చేరుకునే ఆయన, ఆపై నూకాలమ్మవారి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆపై రూ. 50 లక్షలతో నిర్మించతలపెట్టిన కల్యాణ మండపానికి శంకుస్థాపన చేస్తారు. కొత్తగా నిర్మించే పలు రోడ్లకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. రేపు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పలువురు హాజరు కానున్నారని సమాచారం.