: గాంధీ తాత చదివిన హైస్కూల్ మూతపడింది!


రాజ్ కోట్ లో మహాత్మాగాంధీ చదివిన హైస్కూల్ మూతపడింది. దాదాపు 164 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పాఠశాలను మూసివేశారు. ఈ పాఠశాలను త్వరలోనే మ్యూజియంగా మార్చబోతున్నారు. ఈ స్కూలును మోహన్ దాస్ గాంధీ హైస్కూల్ అని కూడా పిలుస్తారు. 1887లో ఈ స్కూలు నుంచి ఉత్తీర్ణుడుగా గాంధీ బయటకు వచ్చారు. 1853 అక్టోబర్ 13న బ్రిటీష్ వారి పాలన సమయంలో ఈ పాఠశాలను నిర్మించారు. సౌరాష్ట్ర ప్రాంతంలో ఇదే మొట్ట మొదటి ఇంగ్లీష్ మీడియం స్కూలు కావడం గమనార్హం. తదనంతర కాలంలో 1875లో ప్రస్తుతం ఉన్న పాఠశాల భవనాన్ని జునాఘడ్ నవాబు నిర్మించారు.

ఈ స్కూల్ ను మ్యూజియంగా మార్చాలని గత ఏడాదే ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో, ఈ పాఠశాలలో చదువుతున్న 125 మంది విద్యార్థులకు టీసీలు ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరంలో తమకు నచ్చిన పాఠశాలలో విద్యార్థులు చేరవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News