: హాలీవుడ్ లో రీమేక్ అయిన కమలహాసన్ చిత్రం!


'ఉత్తమ విలన్'... జీవిత చరమాంకంలో ఉన్నానని తెలుసుకున్న ఓ హీరో తన ఆఖరి రోజుల్లో ఏం చేశాడన్న కథాంశంతో తెరకెక్కిన రెండేళ్ల నాటి కమల్ హాసన్ సినిమా ఇది. ఈ సినిమా సూపర్ హిట్ కాకపోయినా, కమల్ చూపిన అద్భుత నటనా ప్రతిభకు విమర్శకుల ప్రశంసలు అందాయి. ఇక ఇదే పాయింట్ ను తీసుకుని హాలీవుడ్ దర్శకుడు బ్రెట్ హాలే 'ది హీరో' అనే చిత్రాన్ని తీయగా, అది జూన్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమైంది. ఈ చిత్రం టైటిల్స్ క్రెడిట్స్ లో సైతం కమలహాసన్ పేరు కనిపించనుందని సమాచారం. పలు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడి ప్రశంసలు దక్కించుకున్న ఈ చిత్రం 'ఉత్తమ విలన్'కు రీమేక్ గా తీశారా? లేక ఫ్రీ మేక్ గా తీశారా? అన్న విషయం తెలుసుకోవాలంటే చిత్రం విడుదల వరకూ ఆగక తప్పదు.

  • Loading...

More Telugu News