: బ్యాంకులకు 3,871 కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టిన కంపెనీ ఛైర్మన్ అరెస్టు
బాస్మతి బియ్యం ఎగుమతి కంపెనీగా ఆవిర్భవించి, 3,871 కోట్ల రూపాయలకు బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన 'రే ఆగ్రో' కంపెనీ ఛైర్మన్ సంజయ్ ఝున్ ఝున్ వాలాను సీబీఐ అదుపులోకి తీసుకుంది. నకిలీ పత్రాలు, బిల్లులు సృష్టించడమే కాకుండా... షెల్ (డొల్ల) కంపెనీలు ఏర్పాటు చేయడం... బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకోవడం, అనంతం నకిలీ బిల్లులు, పత్రాలతో సదరు కంపెనీ నష్టాల్లో మునిగిపోయిందంటూ బిచాణా ఎత్తేయడం...ఇలా వివిధ బ్యాంకుల నుంచి 3,871 కోట్ల రూపాయలు తీసుకుని ఆయన బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టారు.
దీంతో ఈ సంస్థ నిర్వాకాలపై యూకో బ్యాంకు నేతృత్వంలోని 14 బ్యాంకుల కన్సార్టియం ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ రే ఆగ్రో ఛైర్మన్ సంజయ్ ఝన్ ఝన్ వాలాతో పాటు ఈ కంపెనీ ప్రమోటర్ సందీప్ ఝన్ ఝన్ వాలాను అదుపులోకి తీసుకుంది.