: అమెరికా వీసా నిబంధనలు మరింత కఠినతరం.. ఇక ఈ-మెయిల్, సోషల్ మీడియా పోస్టింగుల గురించి కూడా చెప్పాల్సిందే!
వీసా నిబంధనలను మరంత కఠినతరం చేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది. వీసా అప్లికేషన్ల స్క్రూటినీ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు దరఖాస్తుదారులకు సంబంధించిన సమస్త విషయాలను తెలుసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఉగ్రవాదం, దేశ భద్రతకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్టేట్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.
వీసా కావాలనుకున్నవారు ముందటి పాస్‌పోర్ట్ నంబర్లు, తమ సోషల్ మీడియా ఖాతాకు సంబంధించి ఐదేళ్ల సమాచారం, ఈ-మెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్లతోపాటు తమకు సంబంధించిన 15 ఏళ్ల సమాచారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను మాత్రం అడగరు. వీసా అప్లికేషన్ల స్క్రూటినీని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకే ఈ వివరాలను సేకరించనున్నట్టు స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు.