: యూపీలో ట్రక్కు బోల్తా...14 మంది మృతి...24 మందికి తీవ్ర గాయాలు
ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఎటా జిల్లాలో వివాహానికి హాజరై వస్తున్న పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రక్కు బోల్తా పడింది. దీంతో ఈ ట్రక్కులో ప్రయాణిస్తున్న 14 మంది అక్కడికక్కడే మృత్యువాత పడగా, మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రక్కు అకస్మాత్తుగా బోల్తా పడడంతో ఆ ప్రాంతంలో హాహాకారాలు మిన్నంటాయి. కళ్ల ముందే బంధువులు, సన్నిహితులు ప్రాణాలు కోల్పోవడంతో అంతవరకు ఆనందంగా వస్తున్న వారు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై మరిన్న వివరాలు తెలియాల్సి ఉంది.