: లోకేశ్ చదువు, దీక్షాదక్షతలే గీటురాయి!: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్
లోకేశ్‌ను ఎవరో ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదని, ఆయన చదువు, సామర్థ్యం, దీక్షాదక్షతలే గీటురాయి అని ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. భూ కేటాయింపుల కమిటీలో ఏ మంత్రికైనా స్థానం కల్పించవచ్చన్న విషయం ఐదేళ్లు మంత్రిగా పనిచేసిన వైసీపీ నేత పార్థసారథికి తెలియకపోవడం హాస్యాస్పదమన్నారు. అవినీతి గురించి ఆయన మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. కమిటీలో లోకేశ్‌కు స్థానం కల్పించడాన్ని తప్పు పట్టడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఫెరా ఉల్లంఘన, మనీలాండరింగ్, ఈడీ కేసుల్లో జగన్, పార్థసారథి కూడా నిందితులేనని రాజేంద్రప్రసాద్ అన్నారు.