: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం


గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలు-గుంటూరు రహదారిలో మేడికొండూరు మండలం భీమినేనివారి పాలెం- మేడికొండూరు గ్రామాల మధ్య హైదరాబాద్‌ నుంచి గుంటూరు వస్తున్న బొలెరో వాహనం ఎదురుగా వస్తున్న లారీని  ఢీ కొట్టింది. దీంతో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరొకరిని గుంటూరుకు తరలిస్తుండగా మృతి చెందారు. సంఘటనా స్థలికి చేరుకున్న గుంటూరు డీఎస్పీ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను గుంటూరు వైద్యశాలకు తరలించారు.

  • Loading...

More Telugu News