: యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ మొదటి విదేశీ పర్యటనలో మార్పు?
యూఎస్ అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ మొదటి విదేశీ పర్యటన ఇజ్రాయెల్, వాటికన్, సౌదీ అరేబియా దేశాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పేరు చెప్పేందుకు నిరాకరించిన వైట్ హౌస్ అధికారులు తెలిపారు. బెల్జియం, ఇటలీలో పర్యటనలకు కన్నా ముందుగానే ఈ దేశాల్లో ట్రంప్ పర్యటించనున్నట్టు తెలుస్తోంది. కాగా, ట్రంప్ తో పాలస్తీనా నేత మహ్మద్ అబ్బాస్ నిన్న వైట్ హౌస్ లో భేటీ అయ్యారు. ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య శాంతి నెలకొల్పేలా తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ ఆయనకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ రోజు క్యాథలిక్ మత పెద్దలను ట్రంప్ కలిశారు.