: తొలిసారిగా జర్నలిస్టు అవతారమెత్తాను.. అమితాబ్ ను ఇంటర్వ్యూ చేశాను!: రామ్ గోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొట్టమొదటిసారిగా జర్నలిస్టు అవతారమెత్తారు. అంతేకాదు, ఇంతకుముందెన్నడూ ఏ చిత్ర దర్శకుడు కూడా బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ ను ఇంటర్వ్యూ చేయలేదని, ఆ అవకాశం కూడా తానే తొలిసారి కొట్టేశానని చెప్పారు. ఈ మేరకు వర్మ వరుస ట్వీట్లు చేశారు. జర్నలిస్టు అవతారమెత్తిన తాను అమితాబ్ ను ఇంటర్వ్యూ చేశానని, ఈ నెల 8వ తేదీన ఉదయం 11 గంటలకు ఫుల్ ఇంటర్వ్యూను చూడవచ్చని వర్మ పేర్కొన్నారు.