: చైనాపై అమెరికా ఆధారపడుతోంది: రాబర్ట్ ముగాబే
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జింబాబ్వే దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతోంది. నిరుద్యోగ సమస్య కూడా పట్టిపీడిస్తోంది. అయితే, జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే తాజాగా పలు వ్యాఖ్యలు చేసి అంతర్జాతీయంగా వార్తల్లోకెక్కారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్యానల్ డిస్కషన్‌లో ఆయన మాట్లాడుతూ... అసలు తమది పేద దేశం కాదని అన్నారు. దుర్భర దేశం అంతకంటే కాదని, తాను అమెరికాను దుర్భర దేశంగా పిలుస్తానని అన్నారు. ఎందుకంటే చైనాపై అమెరికా ఎక్కువగా ఆధారపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికా తర్వాత జింబాబ్వేయే అత్యంత అభివృద్ధి చెందిన దేశమని ఆయన పేర్కొన్నారు. తమది విఫలదేశం కాదనడానికి 90 శాతం అక్షరాస్యత నమోదు కావడమే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.