: ఉగ్రవాదనుకుని పొరపడి మంత్రిని చంపేసిన సొమాలియా భద్రతా బలగాలు
మంత్రిని చూసి ఉగ్రవాదిగా పొరపడిన భద్రతా బలగాలు ఆయనను తుపాకులతో కాల్చేసిన ఘటన సొమాలియా రాజధాని మొగాదిషులో చోటు చేసుకుంది. ఈ ఘటనలో సదరు మంత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అనంతరం ఆయనను చూసిన భద్రతా బలగాలు పశ్చాత్తాపపడ్డాయి. ఈ ఘటనపై అక్కడి అధికారులు మాట్లాడుతూ... మొగాదిషులో ఆల్‌ఖైదా ఉగ్రవాదులు గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నోసార్లు దాడులు చేసిన నేపథ్యంలో భద్రతా బలగాలు శాంతి భద్రతలను పరిరక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. అబ్బాస్ సిరాజీ అనే మంత్రి అదే ప్రాంతంలో నిన్న తన కారులో ఓ పని నిమిత్తం వెళుతున్నారని, ఆయనను దూరం నుంచి చూసిన భద్రతా బలగాలు కాల్పులు జరిపాయని చెప్పారు.