: వరుసగా నాలుగో రోజు కూడా తగ్గిన బంగారం ధర
అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, స్థానిక వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గిపోవడంతో పసిడి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా బంగారం ధర దిగజారింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ఈ రోజు మరో రూ.270 తగ్గి, రూ.28,880గా నమోదైంది. దీంతో పసిడి ధర ఆరు వారాల కనిష్ఠానికి చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారం ధర 0.28 శాతం తగ్గడంతో సింగపూర్‌లో ఔన్సు పసిడి ధర 1,234గా నమోదైంది. మరోవైపు అంతర్జాతీయ పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి ధర కూడా రూ.650 తగ్గి, కిలో వెండి ధర రూ.38,850గా నమోదైంది.