: విశ్వనాథ్ దంపతులకు వెంకయ్యనాయుడు దంపతుల సన్మానం


దాదాపు సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ దంపతులకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దంపతులు సన్మానం చేశారు. ఢిల్లీలోని వెంకయ్యనాయుడు నివాసంలో ఈ సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, బీజేపీ నేత, సీనియర్ నటుడు కృష్ణంరాజు, నిర్మాత దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ‘మన వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా, మన భారతీయ సంస్కృతీ సంప్రదాయలు, కుటుంబ వ్యవస్థ ఇలాగే కొనసాగాలనే విషయంలో విశ్వనాథ్ గారు చేసిన కృషి ఎప్పటికీ మరచిపోలేము.

ఆయన సినిమాల్లో జుగుప్ప, హింస, డ్యూయెట్లు.. లేకపోయినా హిట్ అవడానికి కారణం నేటివిటీ. మన సంస్కృతికి దర్పణం పట్టే విధంగా, భారతీయ జన జీవానికి అద్దం పట్టేలా వాస్తవ పరిస్థితులను ఆయన చూపించారు. సినిమా అనేది మనల్ని ఊహల్లో విహరింపజేస్తుంది. వాస్తవానికి కొద్దిగా దూరంగా ఉంటుంది. అలా కాకుండా, వాస్తవానికి దగ్గరగా విశ్వనాథ్ గారి సినిమాలు ఉంటాయి. నేటి తరానికి ఆయన ఆదర్శప్రాయుడు’ అని చెప్పుకొచ్చారు. కాగా, ఢిల్లీ నుంచి బయలు దేరిన కె.విశ్వనాథ్ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు.


  • Loading...

More Telugu News