: మెట్రో సిటీల్లో తొలి స్థానంలో నిలిచాం: కేటీఆర్


స్వచ్ఛ సర్వేక్షణ 2017 ర్యాంకుల్లో క్లీనెస్ట్ సిటీల్లో హైదరాబాద్ 22వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకు సాధించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్ కతా, పూణేల కంటే హైదరాబాద్ మెరుగైన స్థానంలో ఉందని తెలిపారు. గతంలో 500 నగరాల్లో 274వ స్థానంలో ఉన్నామని... గత ఏడాది 75 నగరాల్లో 19వ స్థానంలో నిలిచామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నగరాలు అభివృద్ధి చెందేందుకు ఎంతో అవకాశం ఉందని చెప్పారు. 

  • Loading...

More Telugu News