: రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థికే మద్దతిస్తాం: టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పదవీకాలం ఈ ఏడాది జూలై 24వ తేదీతో ముగియనున్న విషయం తెలిసిందే. తదుపరి రాష్ట్రపతి కోసం త్వరలోనే ఎన్నిక జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్న నేపథ్యంలో తమ మద్దతు ఎవరికి ఉంటుందనే అంశంపై టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి స్పందించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ బలపరిచే అభ్యర్థికే తమ పార్టీ మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని జితేందర్‌రెడ్డి అన్నారు. ఎన్డీఏ తెలంగాణకు అనుకూలంగా ఉందని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. దీనిపై త్వరలోనే పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.