: ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ సమయం: చంద్రబాబు


దేశంలోని అత్యంత పరిశుభ్ర నగరాల టాప్ టెన్ జాబితాలో రెండు ఏపీ నగరాలు ఉండటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. తొలి పది స్వచ్ఛ నగరాల్లో విశాఖపట్నం, తిరుపతిలు నిలవడం ఏపీకి గర్వకారణమని చెప్పారు. ఇది మన రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్క పౌరుడు గర్వించదగ్గ క్షణమని అన్నారు. స్వచ్ఛ నగరాల జాబితాను ఈ ఉదయం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో వైజాగ్ 3వ స్థానాన్ని, తిరుపతి 9వ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. 

  • Loading...

More Telugu News