: రామ మందిరం పునాదులపైనే బాబ్రీ మసీదు కట్టారు: సుబ్రహ్మణ్య స్వామి
అయోధ్యలో రామ మందిరంపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మరోసారి పలు వ్యాఖ్యలు చేశారు. రాముడి మందిరాన్ని రాముడు పుట్టాడని నమ్మిన చోట మాత్రమే నిర్మిస్తారని ఆయన అన్నారు. మసీదులను మాత్రం ఎక్కడైనా నిర్మించుకోవచ్చని పేర్కొన్నారు. అసలు అయోధ్యలో రామ మందిరం పునాదులపైనే బాబ్రీ మసీదు నిర్మించారని ఆయన అన్నారు. ఈ విషయం అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు పురావస్తు శాఖ చేసిన పరిశోధనల్లో తేలిందని ఆయన చెప్పారు. అన్ని ముస్లిం దేశాల్లోనూ రోడ్లు విస్తరణ పనులు చేయాల్సి వస్తే వివిధ ప్రాంతాల్లో నిర్మించిన మసీదులను కూలగొడుతున్నారని, పైగంబర్ మహ్మాద్ సలహా మేరకు నిర్మించిన మక్కా మసీదును కూడా కూల్చేశారని వ్యాఖ్యానించారు. ముస్లింలు రాజీకొస్తే వాళ్లు మరేచోటైనా మసీదును నిర్మించుకోవచ్చని పేర్కొన్నారు. రామమందిరం మాత్రం రాముడు జన్మించిన చోటే కట్టాలని అన్నారు.