: ఊడిగం చేయడమే ఎంఐఎం పని.. కేసీఆర్ ను సాక్షిగా పిలవాలి: దిగ్విజయ్ సింగ్


ఎన్నికల ముందు వరకు తమ మిత్రపక్షంగా ఉండి, ఆ తర్వాత టీఆర్ఎస్ పక్షాన నిలిచిన ఎంఐఎం పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఊడిగం చేయడమే ఎంఐఎం పని అని విమర్శించారు. ముస్లిం యువతను పోలీసులు ట్రాప్ చేస్తున్నా ఎంఐఎం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఒవైసీలకు వారి వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. బీహార్, యూపీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా పరోక్షంగా బీజేపీకి ఎంఐఎం సహకరించిందని మండిపడ్డారు. తనపై హైదరాబాదులో కేసు పెట్టినందుకు చాలా సంతోషమని చెప్పారు. ఈ కేసులో ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర హోం మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు, ఇంటెలిజెన్స్ చీఫ్ లను సాక్షులుగా పిలవాలని డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News