: పాకిస్థాన్ జెండాలను తగలబెట్టేందుకు యత్నం.. ఆందోళనకారుల అరెస్ట్
దేశ సరిహద్దుల వద్ద భారత సైనికులపై పాక్ ఆర్మీ చేసిన దాడి పట్ల దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, తమిళనాడులోని కోయంబత్తూరులో హిందూ మక్కల్ కచ్చి సంఘం నిరసన కార్యక్రమం చేపట్టింది. పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పాకిస్థాన్ జెండాలను తగలబెట్టేందుకు ఆందోళనకారులు యత్నించారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఏ దేశానికి చెందిన జాతీయ జెండానైనా అవమానించడం నేరమని పోలీసులు హెచ్చరించారు.
అయినప్పటికీ ఆందోళనకారులు వినకుండా పాక్ జెండాను తగలబెట్టేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం చెలరేగింది. అనంతరం తొమ్మిది మంది హిందూ మక్కల్ కచ్చి సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.