: దిగ్విజయ్‌ సింగ్‌పై హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజ‌య్ సింగ్ ఇటీవల చేసిన ఓ ట్వీట్ తెలంగాణ‌లో తీవ్ర దుమారం రేపిన విష‌యం తెలిసిందే. తమ నకిలీ వెబ్‌సైట్‌ ద్వారా ముస్లిం యువతను ఉగ్రవాదంవైపు ప్రేరేపించేలా తెలంగాణ పోలీసులు రెచ్చగొట్టే సందేశాలు పెడుతున్నార‌ని ఆయ‌న చేసిన ట్వీట్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత స‌హా పోలీసులు కూడా ఘాటుగా స్పందించారు. అనంత‌రం కూడా దిగ్విజ‌య్ తాను చేసిన ఆరోప‌ణ‌ల‌పై వెన‌క్కిత‌గ్గ‌లేదు.

దీంతో హైద‌రాబాద్ జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పోలీస్ స్టేష‌న్‌లో దిగ్విజ‌య్‌పై ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈరోజు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ అంశంపై మూడు రోజుల క్రితమే ఫిర్యాదు అందినప్పటికీ తాము న్యాయ నిపుణులను సంప్ర‌దించి, ఈ విష‌యాన్ని ప‌రిశీలించి ఈ రోజు కేసు నమోదు చేశామ‌ని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News