: 26 మందిని పొట్టన బెట్టుకున్న మావోయిస్టుల గ్రూపులోని పది మంది అరెస్ట్!
గత నెలలో చత్తీస్ గఢ్ లోని సుకుమా అటవీ ప్రాంతంలో భోజనాలు చేసేందుకు కూర్చున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై భీకర దాడికి పాల్పడి 26 మందిని పొట్టన బెట్టుకున్న మావోయిస్టు గ్రూపులోని 10 మందిని కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఉదయం మావోలు పట్టుబడ్డట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సుమారు 600 మంది పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు అడవులను జల్లెడ పడుతున్న సంగతి తెలిసిందే.
కాగా, ఈ ఉదయం గడ్చిరోలి జిల్లాలో ఓ పెట్రోలింగ్ వాహనంపై మావోలు దాడి చేసిన ఘటనలో ఓ జవాను మరణించగా, 14 మందికి గాయాలు అయ్యాయి. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు జరుపగా, మావోలు పారిపోయినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని హెలికాప్టర్లలో ఆసుపత్రికి తరలించి, ఆ ప్రాంతానికి అదనపు బలగాలను పంపారు.