: మంచి కథ సిద్ధం చేస్తే కనుక బాహుబలి-3 గురించి ఆలోచిస్తా: రాజమౌళి


'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. వెయ్యికోట్ల క్లబ్ లో చేరనున్న తొలి భారతీయ సినిమాగా చరిత్ర నెలకొల్పేందుకు పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో లండన్ టూర్ లో ఉన్న ఈ సినిమా దర్శకుడు రాజమౌళి 'బాహుబలి-3' సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లండన్ లోని ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ కళాశాలను సందర్శించిన సందర్భంగా అక్కడి విద్యార్థులతో రాజమౌళి ముచ్చటించారు. ఇంత అద్భుత విజయం సాధించిన 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' కు కొనసాగింపుగా...హాలీవుడ్ తరహాలో మరో సీక్వెల్ తీసుకొచ్చే అవకాశం ఉందా?...ఆ దిశగా ప్లాన్ చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

 దీనికి ఎప్పట్లా చిరునవ్వుతో సమాధానం చెప్పిన రాజమౌళి...ప్రస్తుతానికైతే ఆ ఆలోచన లేదని అన్నారు. కథ సిద్ధంగా లేకుండా 'బాహుబలి-3' సినిమా తీస్తున్నానని ప్రకటించి ఆడియెన్స్ ను మోసం చెయ్యలేనని చెప్పాడు. తన తండ్రి విజయంద్ర ప్రసాద్ తనను ఉత్కంఠకు గురి చేసేలా కథను తయారు చేస్తే, అప్పుడు తప్పకుండా 'బాహుబలి-3' సీక్వెల్ దిశగా ఆలోచిస్తానని చెప్పారు. కథ తనను ఆకట్టుకుంటే కనుక రూపొందించేందుకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. దీంతో 'బాహుబలి-3' సినిమా ఉంటుందని హింట్ ఇచ్చాడని అభిమానులు ముచ్చటపడిపోతున్నారు. 

  • Loading...

More Telugu News