: ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం... అతని సినిమాలు వదిలే ప్రసక్తే లేదు: అనుష్క
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని... అతన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలనని హీరోయిన్ అనుష్క తెలిపింది. ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విధంగా స్పందించింది. ప్రభాస్ తో నటించే అవకాశం ఎప్పుడు వచ్చినా వదులుకోనని... భవిష్యత్తులో కూడా నటిస్తూనే ఉంటానని చెప్పింది.
టాలీవుడ్ లో ప్రభాస్, అనుష్కల కాంబినేషన్లో పలు సినిమాలు వచ్చాయి. తాజాగా వీరు నటించిన 'బాహుబలి-2' సినిమా ఊహించని విజయాన్ని సాధించి, రికార్డులను కొల్లగొడుతోంది. ప్రస్తుతం ప్రభాస్ కు చెందిన యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న 'భాగమతి' సినిమాలో అనుష్క నటిస్తోంది.