: రహానే, ధోనీలను వెనక్కు నెట్టేసిన యువ సంచలనం త్రిపాఠి


ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 10వ సీజన్ లో అత్యంత వేగంగా అర్ధ శతకం చేసిన ఆటగాడిగా నిలిచిన పుణె సూపర్ జెయింట్స్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి, మహేంద్ర సింగ్ ధోనీ, రహానేలను వెనక్కు నెట్టేశాడు. తన మెరుపు ఇన్నింగ్స్ తో 23 బంతుల్లోనే 53 పరుగులు (8 ఫోర్లు, 3 సిక్సులు) కొట్టి హాఫ్ సెంచరీ చేసి, ఆపై మరింత వేగంగా ఆడి, 93 పరుగులు సాధించి బలమైన కోల్ కతా జట్టుపై పుణెకు ఒంటిచేత్తో విజయాన్ని అందించిన త్రిపాఠిపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతకుముందు ఇదే సీజన్ లో రహానే 27 బంతుల్లో, ధోనీ 29 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేయగా, త్రిపాఠి ఆ రికార్డును తిరగరాసిన ఘనత దక్కించుకున్నాడు.

  • Loading...

More Telugu News