: 'బాహుబలి-2' సినిమాకెళ్లి 20 నిమిషాల్లోనే బయటకు వచ్చేసిన హీరోయిన్ సమంత


రిలీజుకు ముందు నుంచే సంచలనం సృష్టిస్తూ వచ్చి, ఆపై విడుదలైన తరువాత కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్న 'బాహుబలి: ది కన్ క్లూజన్' సినిమా చూసేందుకు వెళ్లిన అందాల నటి సమంత, పట్టుమని అరగంట కూడా చూడకుండానే బయటకు వచ్చేసిందట. సుమారు 40 మంది చిన్నారులను తీసుకుని హైదరాబాద్ లోని ఓ థియేటరులో సినిమా చూసేందుకు వెళ్లిన సమంత, 20 నిమిషాల తరువాత బయటకు రావడానికి ఆ థియేటర్ లో ఏసీ సరిగ్గా పనిచేయకపోవడమే కారణమట. ఏసీ సమస్యతో, ఉక్కపోత తలెత్తగా, తట్టుకోలేకపోయిన ఆమె, బయటకు వచ్చేసిందట. ఈ విషయం బయటకు రావడంతో, బాహుబలి టీమ్ విచారం వ్యక్తం చేయగా, థియేటర్ యాజమాన్యం క్షమాపణలు చెప్పినట్టు తెలిసింది. కాగా, సినిమాను మరో థియేటరులో సమంత చూసిందో చూడలేదో తెలియదు కానీ, బాహుబలిని అభినందిస్తూ ట్వీట్ చేసేసింది సమంత.

  • Loading...

More Telugu News