: ప్రభాస్ కు పెళ్లి ప్రపోజల్స్ ఎన్ని వచ్చాయో తెలుసా?


'బాహుబలి' సినిమాతో టాలీవుడ్ హీరో ప్రభాస్ ఇమేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఇక నేషనల్ మీడియాలో అయితే ప్రభాస్ గురించి అనేక ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థ వెలువరించిన కథనం చాలా ఆసక్తికరంగా ఉంది. అదేంటంటే, ప్రభాస్ కు ఇప్పటి దాకా 6వేల మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయట. అయితే తన ఫోకస్ మొత్తం 'బాహుబలి' మీదే ఉంచడంతో ఈ ప్రపోజల్స్ ను ప్రభాస్ దూరంగా పెట్టాడట. అంతేకాదు, ఓ సంస్థకు ప్రచారకర్తగా ఉండేందుకు ప్రభాస్ కు రూ. 10 కోట్ల ఆఫర్ వచ్చినప్పటికీ ప్రభాస్ తిరస్కరించాడట. బాలీవుడ్ ఆఫర్లు తలుపు తట్టినా 'బాహుబలి' కోసం ఆ ఆఫర్లను తిరస్కరించాడని సదరు పత్రిక తెలిపింది. ప్రభాస్ కు ఉన్న అంకిత భావానికి ఇదొక నిదర్శనమని చెప్పింది. 

  • Loading...

More Telugu News