: ఓ నెల రోజులు జైల్లో ఉంటా... దయచేసి అనుమతించండి: కలెక్టర్ కు అడిషనల్ కలెక్టర్ విన్నపం


నియాజ్ ఖాన్... ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లా అడిషనల్ కలెక్టర్. తాను ఓ నెల రోజుల పాటు జైల్లో గడిపేందుకు, అది కూడా గ్యాంగ్ స్టర్, మాఫియా డాన్ అబూ సలేంతో గడిపేందుకు అనుమతించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ రాజేష్ జైన్ ను వెరైటీ కోరిక కోరారు. తాను అబూ సలేం జీవిత చరిత్రను కథగా రాయాలని అనుకుంటున్నానని, అందుకోసం అతని క్యారెక్టర్, రోజువారీ జీవితం పరిశీలించడంతో పాటు, గత చరిత్రను గురించి అడిగి తెలుసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు.

'లవ్ డిమాండ్స్ బ్లడ్' పేరిట తాను అబూసలేం కథకు నవలా రూపం ఇవ్వదలిచానని, ఇది ఓ థ్రిల్లర్ నావెల్ గా తయారవుతుందని చెప్పారు. ఇక నియాజ్ కోరికపై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని స్థితిలో ఉన్న కలెక్టర్, అతని అభ్యర్థనను ఉన్నతాధికారులకు పంపారు. కాగా, ప్రస్తుతం జీవితఖైదును అనుభవిస్తున్న అబూసలేంపై 54 క్రిమినల్ కేసులు ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News