: అమెరికాలోని కాలేజీలో కాల్పులు... పరుగులు తీసిన విద్యార్థులు!
అమెరికాలోని కళాశాలలో కాల్పుల కలకలం రేపింది. ఒక విద్యార్థి... తన సహచర విద్యార్థిని కాల్చి చంపిన తరువాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టెక్సాస్ లోని నార్త్ లేక్ కాలేజీలో ఈ సంఘటన జరిగింది. అకస్మాత్తుగా కాల్పుల శబ్దం వినిపించడంతో విద్యార్థులు వణికిపోయారు. పలువురు విద్యార్థులు పరుగులు తీశారు. సుమారు 1100 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్న కళాశాలలో తుపాకి కాల్పుల శబ్దం వినపడడంతో హడలిపోయారు. విద్యార్థులు తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారని తెలుస్తోంది.
ఉగ్రవాదులు ప్రవేశించారేమోనని బెంబేలెత్తిపోయిన పలువురు ఏడుపు లంకించుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసేంతవరకు విద్యార్థులు తరగతి గదులను వీడి బయటకు రాలేదు.