: విధుల్లో ఉండి మందేసి, బార్ గర్ల్స్ తో చిందేసిన యూపీ పోలీస్!


ఓ డ్యాన్స్ కార్యక్రమానికి బందోబస్తు నిమిత్తం వెళ్లిన ఓ పోలీసు అధికారి పూటుగా మందుకొట్టడంతో పాటు, స్టేజ్ ఎక్కి బార్ గార్ల్స్ తో చిందులేసి అడ్డంగా దొరికిపోయాడు. ఆ పోలీసుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే, యూపీలోని శ్రావస్తి జిల్లాలో ఓ కార్యక్రమం సందర్భంగా రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేసి బార్ గర్ల్స్ తో డ్యాన్స్ చేయించారు.

ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా బందోబస్తు నిమిత్తం వెళ్లిన సదురు పోలీసు, మందుకొట్టి స్టేజ్ ఎక్కాడు. ఆపై ముగ్గురు డ్యాన్సర్ల మధ్య తన స్టయిల్ లో చిందులేస్తూ, వారిపై డబ్బులు విసిరాడు. ఇక ఈ పోలీసు నిర్వాకంపై స్థానిక మీడియాలోనూ కథనాలు వచ్చాయి. ఇక పాలనలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ తాగుబోతు విషయంలో ఎలా స్పందిస్తారో?

  • Loading...

More Telugu News