: జియో వినియోగదారులకు గుడ్ న్యూస్.. ట్రాయ్ గ్రీన్ సిగ్నల్!
టెలికాం రెగ్యులేటరీ సంస్థ 'ట్రాయ్' ఆదేశాలతో సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ ను జియో ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జియో ధనాధన్ ఆఫర్ అంటూ తన వినియోగదారుల కోసం ఆ సంస్థ మరో ఆఫర్ ను తీసుకొచ్చింది. దీంతో, ఈ ఆఫర్ కూడా ఆమోదయోగ్యం కాదంటూ ప్రత్యర్థి టెలికాం కంపెనీలు మళ్లీ ట్రాయ్ ను ఆశ్రయించాయి.
ఈ నేపథ్యంలో ధనాధన్ ఆఫర్ పై వివరణ ఇవ్వాలంటూ జియోను ట్రాయ్ ఆదేశించింది. ఈ క్రమంలో ట్రాయ్ కు జియో వివరణ ఇచ్చింది. జియో ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన ట్రాయ్... ఈ ఆఫర్ లో ఎలాంటి తప్పు లేదంటూ తెలిపింది. దీంతో, ప్రత్యర్థి కంపెనీలు తీవ్ర నిరాశకు గురయ్యాయి. జియో వినియోగదారులు మాత్రం పండగ చేసుకుంటున్నారు.