: యూఎస్ లో మరో దారుణం... తెలుగు యువకుడు సందీప్ పై నల్లజాతీయుల దాడి


అమెరికాలో భారతీయుడిపై దాడి జరిగింది. వాషింగ్టన్ డీసీలో తెలుగు యువకుడు సందీప్ పై ముసుగులు ధరించి వచ్చిన ముగ్గురు నల్లజాతి యువకులు దాడికి పాల్పడ్డారు. సందీప్ నుంచి సెల్ ఫోన్, పర్సు, నగదును వారు దోచుకెళ్లినట్టు తెలుస్తోంది. దుండగులు అటకాయించగానే, వారు దోపిడీకి వచ్చినట్టు గమనించిన సందీప్, మారు మాట్లాడకుండా, తన దగ్గరున్న అన్ని వస్తువులూ ఇవ్వడంతో వారు వెళ్లిపోయారు. లేకుంటే తనను హత్య చేసి ఉండేవారని ఘటన అనంతరం పోలీసులకు సందీప్ తెలిపారు. మాస్క్ లు ధరించి వచ్చిన యువకులు ఎవరన్న విషయమై విచారణ జరుపుతున్నామని వాషింగ్టన్ ఫెడరల్ పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News