: పల్లవి, శ్రవణ్ లపైనా అనుమానాలున్నాయి... ప్రశ్నిస్తాం: ప్రదీప్ కేసులో పోలీసులు


నటుడు ప్రదీప్ ఆత్మహత్య కేసులో ఆయన భార్య పల్లవీ రెడ్డి, వారి కుటుంబ మిత్రుడు శ్రవణ్ లనూ ప్రశ్నించనున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై వారు చెబుతున్న వర్షన్ లో తమకు కొన్ని అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేసుకుంటామని, పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తరువాత మరణానికి అసలు కారణాలు ఏంటన్న విషయం తెలుస్తుందని తెలిపారు. పోలీసులు రాకుండానే రక్తపు మరకలు ఎందుకు తుడిచి వేయాల్సి వచ్చిందన్న కోణంలో విచారణ జరుగుతుందని తెలిపారు. ప్రదీప్, పల్లవిలతో కలసి పనిచేస్తున్న మరికొందరు టీవీ నటుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నామని, ఈ కేసును సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News