: ముంబై ఎయిర్ పోర్టులో కోహ్లీ, అనుష్క జంట... సెల్ ఫోన్లకు పని చెప్పిన అభిమానులు


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ జంట ముంబై ఎయిర్ పోర్టులో కనిపించడంతో అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. విరాట్, అనుష్క పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. మేడే రోజున అనుష్క పుట్టిన రోజు. ఆ రోజు ముంబై ఇండియన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరిగింది. దీంతో ఆరోజు సాయంత్రం వారిద్దరికీ ఏకాంతం దొరకలేదు. మ్యాచ్ ముగిసిన తరువాత ఒక షెడ్యూల్ లేకపోవడంతో వారిద్దరూ ఎక్కడికో వెళ్లారని తెలుస్తోంది. అనంతరం వస్తున్న సమయంలో ముంబై ఎయిర్ పోర్టులో వారిద్దరూ అభిమానుల కంటబడ్డారు. దీంతో అభిమానులు తమ సెల్ ఫోన్లకు పని చెప్పారు. తమ అభిమాన జంటను సెల్ ఫోన్లలో బంధించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

  • Loading...

More Telugu News