: నంద్యాల రాజకీయాల్లో జోరు పెంచిన యువ నేత భూమా బ్రహ్మానందరెడ్డి


నంద్యాల ఎమ్మెల్యే టికెట్ ను ఆశిస్తున్న టీడీపీ యువ నేత భూమా బ్రహ్మానందరెడ్డి జోరు పెంచారు. దివంగత భూమా నాగిరెడ్డి సోదరుడి కుమారుడైన బ్రహ్మానంద రెడ్డి నంద్యాల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. భూమా అనుచరులు ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇస్తున్నారు. భూమా ఇచ్చిన నిధులు ఏమైనా పెండింగ్ లో ఉన్నాయా? అంటూ తమ అనుచరులను అడిగి తెలుసుకుంటున్నారు.

ఈ క్రమంలో, రూ. కోటి విలువైన ప్రతిపాదనలు పంపిన గోస్పాడు, గోవిందపల్లె రోడ్డును ఆయన పరిశీలించారు. ప్రతి కార్యకర్త కూడా పార్టీకి అండగా ఉండాలని, సైనికుల్లా పని చేసి టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని ఆయన సూచించారు. భూమా లేని లోటును తీర్చడానికి తాను శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. తమ కుటుంబానికి మొదటి నుంచి రాజకీయ నేపథ్యం ఉండటంతో... అన్ని విషయాలపై తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News