: ఐదేళ్ల కంపెనీని రూ. 3,965 కోట్లకు అమ్మేసిన ప్రవాసాంధ్రుడు


2012లో ప్రవాసాంధ్రుడు అక్కిరాజు ప్రవీణ్ అమెరికాలో స్థాపించిన నెట్ వర్క్ స్టార్టప్ సంస్థ 'విప్టెల్లా' జాక్ పాట్ కొట్టింది. ఆ సంస్థ తన నెట్ వర్క్ విభాగం విస్తరణకు సహకరిస్తుందన్న నమ్మకంతో భారీ మొత్తం ఇచ్చి సొంతం చేసుకోనున్నట్టు సిస్కో వెల్లడించింది.

శాన్ జోస్ కేంద్రంగా సాఫ్ట్ వేర్ డిఫైన్డ్ వైడ్ ఏరియా నెట్ వర్క్ సేవలందిస్తున్న విప్టెల్లాను కొనుగోలు చేసేందుకు పలు కంపెనీలు ప్రయత్నాలు చేసినప్పటికీ సిస్కో ఇచ్చిన రూ. 3,965 కోట్లు (సుమారు 610 మిలియన్ డాలర్లు) ఆఫర్ కు అక్కిరాజు ఓకే చెప్పారు. మద్రాస్ ఐఐటీ నుంచి బీటెక్, ఆపై హార్వార్డ్ బిజినెస్ స్కూల్ లో మేనేజ్ మెంట్ కోర్సులను పూర్తి చేసిన అక్కిరాజు స్థాపించిన ఈ సంస్థ ఆదాయం కూడా రూ. 1000 కోట్ల వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ డీల్ డిసెంబర్ లోగా పూర్తవుతుందని భావిస్తున్నట్టు సిస్కో ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

  • Loading...

More Telugu News