: మోదీ చెప్పినట్టు చేసింది, బహుమతిగా లక్ష పట్టేసింది... చిత్తూరు మహిళను వరించిన అదృష్టం


ఇండియాలో నగదు రహిత లావాదేవీలను పెంచితే బహుమతులు అందిస్తామని, ప్రతి ఒక్కరూ కార్డులు వాడి నగదు చెల్లించాలని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ మాటలను ఆచరించిన చిత్తూరు జిల్లా కార్వేటి నగరానికి చెందిన నాగమ్మ అనే యువతిని అదృష్టం వరించింది. చౌకదుకాణాల ద్వారా నిత్యావసరాలను కార్డు చెల్లింపులతో కొనుగోలు చేసిన వారికి లక్కీ డిప్ నిర్వహించగా, నాగమ్మకు రూ. లక్ష బహుమతి లభించింది.

ఇక ఇదే స్కీములో భాగంగా 528 మందికి సెల్ ఫోన్లనూ బహుమతిగా అందించనున్నామని అధికారులు వెల్లడించారు. అమరావతిలో జరిగిన నగదు భద్రతా దినోత్సవాల్లో భాగంగా, డ్రా తీయగా నాగమ్మ పేరు వచ్చిందని అధికారులు వెల్లడించారు. అందరు విజేతల జాబితాలను నేడో, రేపో ఎమ్మార్వో కార్యాలయాలకు పంపి నోటీసు బోర్డుల్లో ఉంచుతామని అన్నారు.

  • Loading...

More Telugu News