: కోట్ల విలువైన ఇంటిని ఛారిటీకి ఇచ్చేసిన హీరో సూర్య
ప్రముఖ సినీ హీరో సూర్య ఓ మంచి పని కోసం తన ఇంటినే దానం చేశాడు. తన తండ్రి శివకుమార్ కట్టిన ఈ ఇల్లంటే సూర్యకు, అతని సోదరుడు కార్తికి చాలా ప్రేమ. వీరిద్దరూ ఈ ఇంట్లోనే పుట్టి పెరిగారు. సూర్య పిల్లలకు కూడా ఈ ఇంటితో చాలా అనుబంధం ఉంది. అయితే, కుటుంబం పెద్దదైపోతుండటంతో... మరో పెద్ద ఇంటిని కట్టుకున్నాడు సూర్య.
ఇలాంటి పరిస్థితుల్లో, ఎవరైనా ఈ ఇంటిని అమ్మేసే ప్రయత్నం చేస్తారు. కానీ, తమకు ఎంతో ఇష్టమైన ఇంటిని అమ్మడం సూర్యకు ఇష్టం లేదు. దీంతో, తమ కుటుంబం నిర్వహిస్తున్న అగరం ఫౌండేషన్ కు ఈ ఇంటిని విరాళంగా ఇచ్చేశాడు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ ఇంటి ధర కొన్ని కోట్ల రూపాయల వరకు ఉందట. ఇంత విలువైన ఇంటిని సమాజసేవ కోసం దానం చేయడం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.