: దీనికంతా కారణం టీఆర్ఎస్ ప్లీనరీనే: రేవంత్ రెడ్డి
ఖమ్మం జిల్లా రైతుల కొంప ముంచింది టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీనే అని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్లీనరీకి నిధులు సేకరించే నిమిత్తం ఆ శాఖ మంత్రి హరీష్ రావు బస్తా మోస్తే రూ. 6 లక్షలను వ్యాపారులు ఇచ్చారని... దీంతోనే, తాము ఏమైనా చేయవచ్చనే ధైర్యం వ్యాపారులకు వచ్చిందని మండిపడ్డారు. రైతులకు జరిగిన అన్యాయంపై ఎస్టీ కమిషన్, గవర్నర్ కు విన్నవిస్తామని చెప్పారు. జైల్లో ఉన్న రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.