: నేను దోషిని కాదు... విడుదల చేయండి: సుప్రీంకోర్టులో శశికళ పిటిషన్
జయలలిత అక్రమాస్తుల కేసులో తనకు ఎటువంటి సంబంధమూ లేదని, తాను దోషిని కాదని చెబుతూ, తనను విడుదల చేయాలని శశికళ కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఆమె ఓ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. తీర్పును పరిశీలించాలని కోరిన ఆమె, సంబంధం లేని కేసులో తనకు శిక్ష విధించారని తెలిపారు. కాగా, శశికళ ఇప్పుడు బెంగళూరు శివార్లలోని పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అభుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె తరఫున న్యాయవాదులు వేసిన పిటిషన్ ను విచారించాలా? వద్దా? అన్న విషయాన్ని సుప్రీంకోర్టు నేడు తేల్చనుంది.