: ఆ రోజు చాలా బాధపడ్డాను...రోజంతా బయటకు కూడా రాలేదు: ప్రభాస్
'బాహుబలి2: ద కన్ క్లూజన్' సినిమా అందించిన అద్భుత విజయానందాన్ని ఆస్వాదిస్తున్న ప్రభాస్... 'బాహుబలి: ద బిగెనింగ్' సందర్భంగా ఎదురైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. 'బాహుబలి: ద బిగెనింగ్' విడుదలైన రోజున సినిమా అంచనాలు అందుకోలేదని, ఊహించినంత బాగా లేదని మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. తెలుగులో ఈ టాక్ మరింత ఎక్కువగా వినిపించడంతో రెండేళ్ల శ్రమ బూడిదలో పోసిన పన్నీరుగా మారిందని బాధపడ్డానని ప్రభాస్ చెప్పాడు.
తొలి రోజు ఆ బాధతో రూంలోకి వెళ్లిపోయి...రోజంతా బయటకు కూడా రాలేదని గుర్తు చేసుకున్నాడు. అయితే 'బాహుబలి2: ద కన్ క్లూజన్' ఇలాంటి సమస్య లేకుండా విజయం సాధించడం ఆనందాన్నిచ్చిందని ప్రభాస్ చెప్పాడు. ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు.