: భారత్ బ్రహ్మోస్ బ్లాక్-3 సూపర్ సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
భారత ఆయుధగారంలోని అత్యంత శక్తిమంతమైన బ్రహ్మోస్ బ్లాక్-3 క్షిపణిని ఇండియన్ ఆర్మీ విజయవంతంగా పరీక్షించిందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భూ ఉపరితలం పైనుంచి ప్రయోగించే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని అండమాన్ నికోబార్ దీవుల్లో మొబైల్ అటానమస్ లాంచర్ (మాల్) సాయంతో పరీక్షించినట్టు ఆర్మీ సీనియర్ ఆఫీసర్ తెలిపారు. ప్రయోగ కేంద్రం నుంచి భూతలంపై నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ క్షిపణి విజయవంతంగా ఛేదించిందని ఆయన తెలిపారు. ప్రయోగం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.