: అక్టోబర్ 27న సినీ నటి భావన వివాహం!


కేరళలో సినిమా షూటింగ్ ముగించుకుని స్నేహితురాలి నివాసానికి వెళ్తూ... లైంగిక వేధింపులకు గురైన సినీ నటి భావన వివాహం ముహూర్తం ఖరారైంది. చేదు అనుభవం అనంతరం ఆమెకు ఆమె ప్రియుడు, కన్నడ సినీ నిర్మాత నవీన్ అండగా నిలిచారు. ఘటన చోటుచేసుకున్న కొద్ది కాలానికే ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నారు. అనంతరం తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఆమె... తన విషయంలో జరిగిన దారుణానికి కారణమైన వారిని వదిలిపెట్టనని...న్యాయపోరాటం చేస్తానని తెలిపిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం భావన స్విట్జర్లాండ్ పర్యటనలో ఉందని ఆమె తల్లి పుష్ప తెలిపారు. అయితే రెండు కుటుంబాలు మాట్లాడుకుని...భావన, నవీన్ ల వివాహం అక్టోబర్‌ 27న నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. వివాహం తమ సొంత ఊరు త్రిచూరులో జరగనుందని ఆమె తెలిపారు. ఈ వివాహానికి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, బంధువులను మాత్రమే ఆహ్వానించనున్నామని తెలిపారు. సినీ పరిశ్రమ నుంచి ఎవరిని ఆహ్వానించాలి? అన్న విషయాన్ని భావనకే వదిలేస్తున్నామని పుష్ప తెలిపారు. 

  • Loading...

More Telugu News