: అవార్డు అందుకున్న కూతురు.. మురిసిపోయిన తండ్రి!
బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ తన కూతురు సోనమ్ కపూర్ ఉత్తమనటిగా అవార్డు అందుకోవడం చూసి మురిసిపోయారు ... ఉప్పొంగిపోయారు.‘నీర్జా’ చిత్రంలో తన నటనకు గాను, సోనమ్ కపూర్ ను ఉత్తమనటిగా ఎంపిక చేశారు. ఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన 64వ జాతీయ సినీ అవార్డుల ప్రదానోత్సవంలో ఆ అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా ఆమె అందుకుంది.ఈ దృశ్యాన్ని అనిల్ కపూర్ స్వయంగా తన మొబైల్ ఫోన్ లో చిత్రీకరించారు.