: సచిన్ పేరిట స్మార్ట్ ఫోన్ విడుదల!


క్రికెట్ లెజెండ్ సచిన్ రమేష్ టెండూల్కర్ (ఎస్ఆర్ టి) పేరిట ఓ స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. అతని పేరులోని మొదటి అక్షరాలను తీసుకుని ‘ఎస్ఆర్ టి’ పేరుతో స్టార్టప్ సంస్థ స్మార్టన్ ఈ ఫోన్ ను విడుదల చేసింది. ఈ సంస్థలో సచిన్ కూడా భాగస్వామిగా ఉన్నారు. ఈ కొత్త ఫోన్ ను ఆయన ఆవిష్కరించారు. రెండు మోడల్స్ లో లభ్యం కానున్న‘ఎస్ఆర్ టి’ ఫోన్లను ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ద్వారా పొందవచ్చు.

32 జీబీ మెమరీ ఉన్న‘ఎస్ఆర్ టి’ ఫోన్ ధర రూ.12,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. 4 జీబీ ర్యామ్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగా పిక్సల్ వెనుక కెమెరా, 5 మెగా పిక్సల్ ముందు కెమెరా, స్నాప్ డ్రాగన్ 652 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉన్న ఈ ఫోన్ టైటానియం గ్రే కలర్ లో లభ్యమవుతోంది. కాగా, 64 జీబీ మెమరీ ఉన్న ‘ఎస్ఆర్ టి’ ఫోన్ ధరను రూ.13,999గా నిర్ణయించారు.

  • Loading...

More Telugu News