: జగన్ ఎందుకు దీక్షలు చేస్తున్నారో జనానికి అర్థం కావట్లేదు: మంత్రి సోమిరెడ్డి
ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరులో రైతు దీక్ష పేరిట రెండు రోజులు ధర్నా చేసిన విషయం తెలిసిందే. జగన్ దీక్షపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ ఎందుకు దీక్షలు చేస్తున్నారో జనాలకు అర్థం కావట్లేదని అన్నారు. రైతులకు జరగాల్సిన నష్టం అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని ఆయన అన్నారు.
ప్రస్తుతం మిర్చి సాగు పెరగడంతో కొన్ని ఇబ్బందులు వచ్చాయని అన్నారు. సాగు పెరిగినప్పుడు ధరలు తగ్గడం సహజమేనని అన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఈ ఖరీఫ్ సీజన్‌కు యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేశామని అన్నారు. రూ.100 కోట్లతో నిర్మించనున్న అగ్రికల్చర్ యూనివర్సిటీ బిడ్డింగ్ డిజైన్ ఖరారు చేశామని తెలిపారు.