: బీఫ్ విషయంలో నటి కాజోల్‌కు సీఎం మమత బెనర్జీ మద్దతు


తాను బీఫ్ తింటున్నానని, అందుకోసం అంతా ప్రిపేర్ చేసుకున్నానని ఇటీవలే బాలీవుడ్ నటి కాజోల్ తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసి మరీ తెలిపి అనంతరం తాను తిన్నది బీఫ్ కాద‌ని, దీన్ని వివాదం చేయొద్దని కోరిన విషయం తెలిసిందే. అయితే, ఈ అంశంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ కాజోల్‌ కు మద్దతు తెలిపారు. ఇతరుల ఆహార అలవాట్లపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారని మ‌మ‌తా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎవరు ఏం తినాలన్నది కొందరు నిర్ణయిస్తున్నారని, ఇది మున్ముందు తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News